Thursday, November 28, 2024

September 17th – తెలంగాణ ప్ర‌జ‌ల‌కు విముక్తి క‌లిగిన రోజు: డిప్యూటీ సీఎం భ‌ట్టి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, ఖ‌మ్మం : తెలంగాణ ప్ర‌జ‌ల‌కు 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన నిజాం నిర‌కుంశ పాల‌న నుంచి విముక్తి ల‌భించింద‌ని, అందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జాపాల‌న దినోత్స‌వంగా ఉత్స‌వాలు నిర్వ‌హిస్తోందని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. మంగ‌ళ‌వారం ఖ‌మ్మం ప‌రేడ్ గ్రౌండ్ లో ప్ర‌జాపాల‌న ఉత్స‌వాల్లో ఆయ‌న పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు చెప్పారు. 76 ఏళ్ల కింద‌ట ఇదే రోజున తెలంగాణ‌కు నాటి హైదరాబాద్ సంస్థానం రాజుల పాలన నుండి విముక్తి ల‌భించి, ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement