Thursday, November 14, 2024

TG: రూ.34 లక్షల గంజాయి పట్టివేత… 8మంది అరెస్ట్

.. ఒడిస్సా నుండి హైదరాబాద్ కు తరలింపు

హైదరాబాద్, ఆంధ్రప్రభ : గుట్టు చప్పుడు కాకుండా ఒడిశా నుండి హైదరాబాద్ కు పెద్ద ఎత్తున తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శనివారం ఒడిస్సా నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న 174కిలోల గంజాయిని హయత్ నగర్ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ మహ్మద్ ఖురేషి తెలియజేశారు.

గంజాయి అక్రమ రవాణా దారుల నుండి ఒక మహేంద్ర పికప్ వ్యాన్, హుండాయ్ కార్ తో పాటు 8మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. మహారాష్ట్రకు చెందిన ఐదుగురు, ఒడిశాకు చెందిన ముగ్గురు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించాలనే దురాశతో గంజాయి రవాణాకు పాల్పడుతున్నారన్నారు. గంజాయి సరఫరా చేసినా, విక్రయించినా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. మీడియా సమావేశంలో ఎక్సైజ్ ఏసీపీ తులా శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement