Saturday, December 7, 2024

TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు భద్రత పెంపు..

ఇంటి వద్ద గార్డులతో ఔట్ పోస్ట్ ఏర్పాటు
అలాగే భ‌ద్ర‌తా సిబ్బందితో కాన్వాయ్ కూడా
కూల్చివేత‌ల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు


హైదరాబాద్ : హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఇంటివద్ద పోలీసులు భద్రత పెంచారు. ఈ మేరకు వెంగళ్‌రావునగర్‌ డివిజన్‌ మధురానగర్‌ కాలనీ డీ-81లోని ఆయన ఇంటి వద్ద ఇద్దరు సెక్యూరిటీతో కూడిన ఔట్‌పోస్టును ఏర్పాటు చేశారు. నగరంలో చెరువులు, కుంటల్లో అక్రమ కట్టడాల తొలగింపును వేగవంతం చేసిన నేపథ్యంలో ఆయనకు ఏమైనా ముప్పు ఏర్పడవచ్చనే అనుమానంతో ప్రభుత్వం ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది.

అలాగే అయనకు భద్రతా సిబ్బందితో కూడిన కాన్వాయ్ ను కూడా ప్రభుత్వం సమకూర్చింది. ఇటీవల సినీనటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్‌- కన్వెన్షన్‌ కూల్చివేత తర్వాత బడా రాజకీయ నాయకులకు చెందిన అక్రమ నిర్మాణాలను తొలగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా రంగనాథ్ కు ఆయన ఇంటి వద్ద భద్రత పెంచినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement