Friday, June 9, 2023

వ‌ర‌ద నీటిలో స్కూల్ బ‌స్సు-క్షేమంగా బ‌య‌ట‌ప‌డిన విద్యార్థులు

ఓ ప్రైవేటు పాఠ‌శాల బ‌స్సు వ‌ర‌ద నీటిలో చిక్కుకుంది. అప్ర‌మ‌త్త‌మ‌యిన డ్రైవ‌ర్ స్థానికుల స‌హాయంతో బ‌స్సులో ఉన్న విద్యార్థుల‌ను క్షేమంగా బ‌య‌టికి తీసుకువ‌చ్చాడు.ఈ సంఘ‌ట‌న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ కోడూరు వ‌ద్ద చోటు చేసుకుంది.గురువారం రాత్రి కురిసిన వానతో కోడూరు-మాచన్‌పల్లి మధ్య ఉన్న రైల్వే అండర్‌ బ్రిడ్జిలోకి భారీగా వరద నీరు చేరింది. అయితే రామచంద్రపూర్‌, మాచన్‌పల్లి, సుగుర్గడ్డ తండా నుంచి జిల్లా కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలకు విద్యార్థులు స్కూలు బస్సులో వెళ్తున్నారు. ఈ క్రమంలో అండర్‌ బ్రిడ్జి వద్ద నిలిచిన వరద నీటిలో బస్సు చిక్కుకుపోయింది. ఆ సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ట్రాక్టర్‌ సహాయంతో స్కూలు బస్సును బయటకు తీశారు. చిన్నారులంతా క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement