Thursday, March 28, 2024

స్కాలర్ షిప్ లు వెంట‌నే విడుద‌ల చేయాలి : ఏబీవీపీ

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మేడ్చల్ విభాగ్, చింతల్ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ఐడిపిఎల్ చౌరస్తాలో పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లు, ఫీజు రియంబర్స్ మెంట్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు షణ్ముఖ మాట్లాడుతూ… విద్యార్థులు పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ఈ ప్రభుత్వం విద్యార్థులకు స్కాల‌ర్ షిప్ లు, ఫీజు రియంబర్స్ మెంట్ లను చెల్లించకుండా అనేక ఇబ్బందులకు గురిచేయడం దారుణమ‌న్నారు.

స్కాలర్ షిప్ లు ప్రభుత్వ భిక్ష కాదు… పేద విద్యార్థుల హక్కు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ లు సకాలంలో చెల్లించకపోవడంతో ఫైనల్ ఇయర్ పూర్తయిన విద్యార్థులు సర్టిఫికెట్లు అందక ఉద్యోగాలకు ఇబ్బందిగా ఉందన్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని పెండింగ్ లోని రూ.3816 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్ మెంట్ లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఎస్ ఎఫ్ ఎస్ కన్వీనర్ నాగేష్, చింతల్ నగర కార్యదర్శి మృత్యుంజయ, సోషల్ మీడియా కన్వీనర్ భాను, కళా మంచి కన్వీనర్ సంజయ్, లక్ష్మణ్, సాయి, రాము, కరణ్, చిన్న, ఏబీవీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement