Thursday, April 18, 2024

విచ్చలవిడిగా బెల్ట్ షాపులు.. పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు..

జవహర్ నగర్, (ప్రభా న్యూస్): జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనధికారికంగా బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బెల్టు షాపుల నిర్వాహకులు  ఇండ్ల మధ్యలో మద్యాన్ని విక్రయిస్తుండటంతో  మద్యం సేవించిన వారు దారిలో వస్తున్న యువతులు, మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా  మద్యాన్ని విక్రయిస్తున్న బెల్టుషాపులు నిర్వాహకుల వల్ల మద్యానికి అలవాటు పడినవారు కుటుంబ కలహాలతో విచక్షణ కోల్పోయి ప్రాణాలు తీస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి .

కొన్ని బెల్టు షాపుల మీద స్థానిక పోలీసులు ఎక్సైజ్ అధికారులు. చర్యలు తీసుకున్నప్పటికీ  నిర్వాహకుల ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాకపోగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ దందా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిరంతర పర్యవేక్షణ చేసి  అనధికారికంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని. అలాగే బెల్టు షాపులకు  విచ్చలవిడిగా మద్యాన్ని సరఫరా చేస్తున్న వైన్ షాపుల లైసెన్సులు రద్దు చేయాలని స్థానిక ప్రజలు మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement