Thursday, April 25, 2024

ముచ్చింతల్ లో ఫిబ్ర‌వ‌రి 2వ తేది నుంచి స‌మ‌తా కుంబ్ ఉత్స‌వాలు..

హైదరాబాద్‌: ముచ్చింతల్‌తో 216 అడుగుల పంచ లోహ రామానుజాచార్యుల విగ్రహంతో సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ కేంద్రం ఏర్పడి ఫిబ్రవరి 2వ తేదీ నాటికి ఏడాది కావస్తున్నది. ఈ తరుణంలో ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు సమతా కుంభ్ – 2023 జరుగనుందని వెల్ల‌డించారు చిన జీయర్ స్వామిజీ.. ముచ్చింత‌ల్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, అదే సమయంలో శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 108 దివ్య దేశాలు సమతామూర్తి కేంద్రంలో ఉన్నాయ‌ని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించార‌ని తెలిపారు. అనేక మంది గత బ్రహ్మోత్సవాలను చూశారు.

ఈ ఏడాది కూడా అదే క్రమంలో కార్యక్రమం సాగుతుంద‌న్నారు. కాకపోతే ఈ ఏడాది 9 కుండాలతో ఉండే యాగశాలను ఏర్పాటు చేసి యాగం నిర్వహించనున్నామని వెల్లడించారు. సమతా కుంభ్ పేరుతో ప్రతి సంవత్సరం వేడుకలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 11వ తేదీన లక్ష మందితో భగవద్గీత పారాయణం ఉంటుందన్నారు. అలాగే, రామానుజాచార్యులు చాలా మేధావి అంతే కాకుండా మనసు ఉన్న మనస్వి. అన్ని వర్గాల వారిని సమాజంలోకి తెచ్చి ఆలయాల్లో భాగస్వాములను చేశారని అన్నారు. ఈ క్రమంలోనే చిన్న జీయర్‌కు భారత అ‍త్యున్నత పురస్కారం పద్మభూషణ్‌ రావడంపై ఆయన స్పందించారు. ఈ క్రమంలో చిన్న జీయర్‌ మాట్లాడుతూ ముందు రోజు నాకు ఫోన్‌ చేసి.. లిస్టులో మీ పేరు పెడుతున్నామని చెప్పారు. మీకు ఏదైనా అభ్యంతమా? అని అడిగారు. నాకేమీ అభ్యంతరం లేదని నేను వారికి చెప్పాను. పద్మభూషణ్‌ రావాలని నేను కోరుకోలేదు. అవార్డు వచ్చినందుకు ఆనందంగా ఉంది అని కామెంట్స్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement