Friday, April 19, 2024

భీమ్లానాయక్ సినిమా క్లిపింగ్‌తో ఆర్టీసీకి సజ్జనార్‌ ప్రచారం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నష్టాల బాటలో వేగంగా పరిగెత్తుతున్న ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు సంస్థ ఎండీ సజ్జనార్‌ ఎప్పటికప్పుడు తన ప్రయత్నాలను చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తనకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వాడుకుంటున్నారు. ఆర్టీసీ బస్సు రవాణాను ప్రోత్సహించడానికి ఆసక్తికరమైన ప్రచార కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే బస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రమోషన్స్‌ కోసం ప్రముఖ హీరో సినిమాలను తన ప్రచారంలో వాడుకుంటున్నారు.
ఇటీవల బ్లాక్‌బస్టర్‌ సినిమా భీమ్లానాయక్‌ను తాజాగా తన ప్రచారానికి వాడుకున్నారు. ప్రజలను బస్సులలో ప్రయాణించేలా ప్రోత్సహించడానికి భీవ్లూనాయక్‌ క్లిప్‌ను సజ్జనార్‌ పంచుకున్నారు. క్లిప్‌లో పవన్‌ కళ్యాణ్‌ ఆర్టీసీ బస్సు ఎక్కి అందులో ప్రయాణిస్తున్న దృశ్యాన్ని చూపిస్తూ టీఎస్‌ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి, ప్రయాణాల కోసం ఆర్‌టీసీ బస్సులను ఎక్కమని ప్రజలను ప్రోత్సహించడానికి ఈ వీడియో క్లిప్‌ను ఉపయోగించారు. ఈ క్లిప్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఏంటీ డానీ.. నన్ను ఫాలో అవుతున్నావ్‌? ఇది ఏమైనా భీవ్లూ నాయక్‌ బస్సు ఆ… టీఎస్‌ఆర్టీసీ బస్సు. మనందరి బస్సు అని పవన్‌ కళ్యాణ్‌ డైలాగులతో మార్ఫింగ్‌ చేసిన వీడియోను సజ్జనార్‌ తన వీడియోతో పాటు ట్వీట్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement