Tuesday, April 16, 2024

రైతుబంధు సంబురాలు.. విద్యార్థులకు ముగ్గుల పోటీలు

రైతన్నలను రారాజులుగా చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని  ఎంపిపి గోపగాని బాలమణి యాదగిరి గౌడ్ అన్నారు. ఆదివారం యదాద్రిభువనగిరి జిల్లాలోని  ఆయా గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ, గ్రామపంచాయతీ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుబంధు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్బంగా నాయకులు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాతే సీఎం కేసీఆర్ రైతులకు పెద్దపీట వేశారని అన్నారు.

రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు పొరుగు రాష్ట్రాల అవలంభిస్తున్నాయని, రైతుబంధు పథకం మార్గదర్శిగా మారిందన్నారు.  రైతులందరికి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తూ.. ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్నారు. రాజాపేటలో మార్కెట్ యార్డులో కేసీఆర్ ఫ్లెక్సీకి ధాన్యాభిషేకం నిర్వహించారు. రఘునాథపురంలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలను పెట్టి బహుమతులను అందజేశారు.  ఆయా గ్రామాలలో పండుగ వాతావరణంలో సంబురాలను జరుపుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement