Thursday, April 25, 2024

ఆర్టీసీని బలోపేతం చేయాలి.. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్‌

మహబూబాబాద్‌ అర్బన్‌, ప్రభన్యూస్‌: ఆదాయ మార్గాలను పెంచుకుని ఆర్టీసీని బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్‌ ఆర్టీసీ అధికారులకు, సిబ్బందికి సూచించారు. శుక్రవారం సజ్జనార్‌ మహబూబాబాద్‌ ఆర్టీసీ డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ కె. శశాంక, అడిషనల్‌ ఎస్పీ యోగేష్‌ గౌతం, ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌లు సజ్జనార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మాట్లాడుతూ డిపో నుండి సర్వీసులు ఏయే ప్రాంతాలకు ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి, ఏయే ప్రాంతంలో ఆర్టీసీకి లాభం, నష్టం వస్తున్న వివరాలను అధికారులతో, సిబ్బందితో మాట్లాడి తెలుసుకున్నారు.

ఆర్టీసీ పరిరక్షణతో పాటు, సిబ్బంది కార్మికుల సంక్షేమం మొదటి ప్రాధాన్యత లక్ష్యం అని తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్‌లు, సిబ్బంది ఆత్మవిమర్శ చేసుకుంటూ అందరూ కలిసికట్టు-గా కమి-టె-్మంట్‌తో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఇంధనం పొదుపు చేసిన ఇద్దరు డ్రైవర్‌లు బి. గోపాల్‌, సుధాకర్‌కు జిల్లా కలెక్టర్‌ కె. శశాంక, అడిషనల్‌ ఎస్పీ యోగేష్‌ గౌతం చేతుల మీదుగా నగదు ప్రోత్సాహకం అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో రీజనల్‌ మేనేజర్‌ బి.శ్రీదేవి, డిపో మేనేజర్‌ బి.శ్రీనివాస్‌, కార్మికులు పట్టాభి లక్ష్మయ్య, ముదిరెడ్డి రఘోత్తమరెడ్డి, మల్లయ్య, చంధ్యా నాయక్‌, రమాదేవి, సుమ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement