Thursday, March 28, 2024

Breaking: డీజిల్ కోసం రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు – పెట్రోల్ బంకుల వద్ద బారులు

ఖమ్మం సిటీ : డీజిల్ కోసం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఆర్టీసీ ప్రత్యేకంగా కొనుగోలు చేస్తున్న డీజిల్ రేటు ఎక్కువగా ఉండడంతో ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోడ్లపై ఉన్న పెట్రోల్ బంకుల్లో కాస్త తక్కువ రేటు కు డీజిల్ వస్తుండడంతో ఆర్టీసీ బస్సులు అన్నీ బంకుల వద్ద బారులు తీరాయి. ఆర్టీసీ నేరుగా కంపెనీల నుండి కొనుగోలు చేస్తున్న డీజిల్ రేటు కు, ప్రైవేటు బంకుల వద్ద కొనుగోలు చేసే డీజిల్ రేటు కు రూ.3 చొప్పున లీటర్కు వ్యత్యాసం ఉండడంతో మంగళవారం నుండి ఆర్టీసీ బస్సులకు అధికారులు ప్రైవేటు బంకుల వద్ద డిజిల్ కొట్టించారు.

దీంతో ఖ‌మ్మం బైపాస్ రోడ్డులో ఒక పెట్రోల్ బంకు వద్ద రోడ్డు పొడవునా ఆర్టీసీ బస్సులు డీజిల్ కోసం బారులు తీరడం గమనార్హం. ఇటువంటి పరిస్థితి ఆర్టీసీలో ఇదే ప్రథమం కాదు.. గత అయిదేళ్ల క్రితం కూడా ఇట్లాంటి పరిస్థితే కనిపించింది. మళ్లీ చాలా రోజులకు ఇట్లాంటి పరిస్థితి ఎదురవ్వడంతో అటు అధికారులు ఇటు ప్రజలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. పెట్రోల్ బంకుల వద్ద మోసాలు జరిగే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement