Tuesday, October 26, 2021

ఆర్టీసీ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు

జనగామ జిల్లా చిల్పూర్ మండలం కొండాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు 10 మంది ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యాయి. హుస్నాబాద్ నుంచి జగద్గిరిగుట్ట వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి పంట పొలాల్లో బోల్తా పడింది. ప్రమాద సమయంలో డ్రైవర్, కండక్టర్ సహా 10 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: రాయచూర్ ను తెలంగాణలో కలిపేయాలి: బీజేపీ ఎమ్మెల్యే

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News