Saturday, April 20, 2024

నేటి నుంచి 18 ఆస్పత్రుల్లో రూ.5కే భోజనం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నేటి నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు రూ.5కే నాణ్యమైన భోజనం అందనుంది. తొలిదశలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18 సర్కారు ఆసుపత్రుల్లో ఈ సౌకర్యాన్ని అందుబాటులో తీసుకువస్తున్నారు. దీని ద్వారా రోజుకు 18,600 మందికి లబ్ధిచేకూరుతోందని వైద్యశాఖ అంచనావేస్తోంది. అయితే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించనున్నారు.

ఉస్మానియా, నిమ్స్‌ ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌ రావు ప్రారంభించనుండగా, ఎంఎన్‌జే ఆసుపత్రిలో మంత్రి కేటీఆర్‌, గాంధీ, చెస్ట్‌ ఆసుపత్రిలో మంత్రి తలసాని, ఈఎన్‌టీ ఆసుపత్రిలో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ ప్రారంభించనున్నారు. అదేవిధంగా మలక్‌పేటలోని ఎంఎన్‌ ఏరియా ఆసుపత్రిలో హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎల్బీనగర్‌ ఏరియా ఆసుపత్రి, శేరిలింగంపల్లిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మిగతా చోట్ల ఆ నియోజకవర్గ ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సీలు, మేయర్‌లు రూ.5కే భోజన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement