Thursday, April 25, 2024

రోడ్డు భద్రత అందరి బాధ్యత.. ప్రమాదాల నివారణపై పువ్వాడ సమీక్ష

మమానవ తప్పిదాల వల్లే దాదాపు 91శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని, చిన్నపాటి నియంత్రణతో ఇలాంటి ప్రమాదాల నుండి తప్పించుకునే అవకాశం ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రోడ్డు భద్రతా ప్రమాణాలు, ప్రమాదాల నివారణ చర్యలపై పోలీస్, రవాణా, R&B, మున్సిపల్, NHAI ఉన్నతాధిరులతో ఇవ్వాల సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రోడ్డు భద్రత ప్రమాణాలపై పలు సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంతో జాతీయ రహదారుల ప్రమాదాల తీవ్రత గత సంవత్సరంతో పోల్చితే తగ్గిందన్నారు.

భవిష్యత్తులో నగరం నాలువైపుల నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం జరుగుతుందని తద్వారా ప్రమాదాల వల్ల ఏలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు ప్రణాళికతో రోడ్డు భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే సమయంలో ప్రధాన రహదారులపై హెచ్చరిక బోర్డులు (సైన్‌ బోర్డులు), దారి మలుపులను తెలిపే సూచిక బోర్డులు, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ లైట్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర , జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ , డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం , ACP లు, CI లు, సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement