Sunday, December 8, 2024

TG | వనపర్తిలో రోడ్డుప్రమాదం… 25మంది కూలీలకు గాయాలు

వ్యవసాయ పనులకు కూలీలను తీసుకెళుతున్న వాహనం బోల్తా పడిన ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం ఓ వాహనం బోల్తా పడడంతో అందులోని 25 మంది కూలీలకు గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితులు, స్థానికుల సమాచారం మేరకు.. కొత్తకోట మండలం బూత్కూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు పొరుగున ఉన్న మహబూబ్ నగర్ జిల్లాలోని ఎంకంపల్లి గ్రామానికి పత్తి ఏరడానికి బయలుదేరారు.

నలభై మందికి పైగా కూలీలతో బయలుదేరిన వాహనం పెద్దమందడి మండలం మోజెర్ల స్టేజీ సమీపంలో ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి జాతీయ రహదారిపై బోల్తా పడింది. దీంతో అందులోని కూలీలకు గాయాలయ్యాయి. ప్రమాదం విషయం తెలిసి హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల చికిత్సతో పలువురు కూలీలు కోలుకోగా.. ముగ్గురు కూలీల పరిస్థితి మాత్రం సీరియస్ గా ఉందని వైద్యులు చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement