Tuesday, December 10, 2024

Revanth Schedule – ఢిల్లీలో అధిష్టానంతో భేటి – రేపు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం

హైదరాబాద్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరతారు.

ఏఐసిసి అంతర్గత సమావేశంలో ఆయన పాల్గొంటారు. మంగళవారం మధ్యాహ్నం ఇండియన్ ఎక్స్ ప్రెస్ అడ్డా కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ఢిల్లీ నుంచి మహరాష్ట్రకు బయలుదేరి వెళతారు.

బుధవారం మహరాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ముంబైలోని తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజక వర్గాల్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. తిరిగి రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరి వస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement