Tuesday, April 23, 2024

తెలంగాణ స‌మాజానికి రేవంత్ రెడ్డి బ‌హిరంగ లేఖ

తెలంగాణ సమాజానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటన రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలో భాగమేన‌ని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ తీర్థయాత్రలతో అయ్యేది లేదు.. పొయ్యేదీ లేదన్నారు. కల్లంలో ధాన్యం కొనకుండా ఢిల్లీలో యాసంగి పంటపై డ్రామాలేమిటని అన్నారు. తడిచిన ధాన్యం కొనే అంశంపై కేసీఆర్ వైఖరి చెప్పాలన్నారు. కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆలస్యం వల్లే వర్షాలకు ధాన్యం తడిసి పోయిందన్నారు. వ్యవసాయ చట్టాలపై రైతుల ఒత్తిడితోనే కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారన్నారు. యాసంగి ధాన్యం కొనమని ఒత్తిడి చేయబోమని కేసీఆర్ కేంద్రానికి ఇచ్చిన లేఖే నేడు వరి రైతుల పాలిట ఉరితాడైందన్నారు. కల్లాల్లోకి కాంగ్రెస్ పర్యటనలో రైతుల ఆవేదననే తాను మాట్లాడుతున్నానని రేవంత్ రెడ్డి అన్నారు.

బీజేపీ, టీఆర్ఎస్ లు తెలంగాణ రైతాంగ విశ్వాసాన్ని కోల్పోయాయన్నారు. కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు హామీ ఇచ్చిన లక్ష రుణమాఫీ చేయాలన్నారు. ఎరువులు ఉచితంగా ఇస్తామన్న హామీని అమలు చేయాలన్నారు. చనిపోయిన రైతు కుటుంబాలు పరిహారం కోసం కోర్టులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్ప‌డింద‌ని, తక్షణమే వారికి పరిహారం ఇవ్వాలన్నారు. కౌలు రైతుల సమస్యలను పరిష్కారం చేయాలన్నారు.


రైతాంగ సమస్యలపై నేడు, రేపు మండల, జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ ధర్నాలు, నిరసనలు తెలుపుతున్నామ‌న్నారు. భవిష్యత్ లో కూడా రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం ఉదృతం చేస్తుందన్నారు. తెలంగాణ సమాజం కూడా రైతులకు అండగా నిలవాల్సిన సందర్బం వ‌చ్చింద‌ని రేవంత్ రెడ్డి అన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement