Tuesday, April 23, 2024

కాంగ్రెస్ లోకి రండి – ఈట‌ల‌, కొండా,వివేక్ ల‌కు రేవంత్ రెడ్డి ఆహ్వానం..

హైద‌రాబాద్ – ప్రధాని మోడీ బ్రాండ్ కు కాలం చెల్లిపోయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మోడీని ఓడించవచ్చునని కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందని చెప్పారు. ప్రజల భద్రతను కేంద్రం గాలికి వదిలేసిందని, ప్రజలను పట్టించుకోకుండా కేంద్రమంత్రులు కర్ణాటకలో మోహరించారని రేవంత్ అన్నారు. నేడు గాంధీభవన్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, వివేక్, ఈటల, కొండా లాంటి వాళ్ళు క్షణికావేశంలో బీజేపీలో చేరారని, వారు కాంగ్రెస్ లోకి రావాలని రేవంత్ ఆహ్వానించారు.. సీఎం కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ చేయాలనుకునే వాళ్ళు కాంగ్రెస్‌‌లోకి రావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను నాయకుడ్ని కాదని, సోనియా, ఖర్గేలే నాయకులన్నారు. తన వల్ల ఇబ్బంది అవుతుంది అనుకుంటే. ఒక మెట్టు కాదు పది మెట్లు దిగడానికి తాను సిద్ధమన్నారు.


ఇటీవ‌ల కర్నాట‌క ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ గెలుపుపై రేవంత్ స్పందిస్తూ , కర్ణాటకలో కులాలు , మతాల మధ్య చిచ్చు పెట్టి గెలవాలని బీజేపీ ప్లాన్ చేసిందని, అయితే బీజేపీ కుట్రలను కర్ణాటక ప్రజలు తిప్పికొట్టారన్నారు. కర్ణాటక ప్రజలు ఇచ్చిందని సరైన తీర్పుని వెల్లడించారు. దేశస్థాయిలో బీజేపీ స్థాయిని కాపాడేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. లక్ష కోట్లను కేసీఆర్ కర్ణాటకలో ఖర్చు చేసారని అన్నారు. మోడీ, కేసీఆర్ వేర్వేరు కాదని ఇద్దరు ఒక్కటేనని రేవంత్ ఆరోపణ‌లు గుప్పించారు.. కేసీఆర్ కుట్రల పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు రేవంత్ సూచించారు. కాంగ్రెస్ త్యాగాలు చేసి తెలంగాణ ఇచ్చిందని అంటూ కాంగ్రెస్ లేక‌పోతే కెసిఆర్ ఎక్క‌డ ఉండేవార‌ని ప్ర‌శ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement