Thursday, July 29, 2021

ఉద్యోగ ఖాళీలపై కేసీఆర్ సర్కస్ ఫీట్లు: రేవంత్

ప్రభుత్వంలో ఉద్యోగ ఖాళీలపై కేసీఆర్ సర్కస్ ఫీట్లు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఖాళీలెన్నో తేల్చాలంటూ చేస్తోన్న హడావుడి మరో మోసానికి మాస్టర్ ప్లాన్‌లా ఉందన్నారు. 2020 డిసెంబర్‌లో బిస్వాల్ కమిటీ ఇచ్చిన పీఆర్సీ నివేదిక ప్రకారం 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు అధికారికంగా స్పష్టమైందని తెలిపారు. ఆ నివేదిక ఉండగా కొత్తగా లెక్కలు తేల్చేదేంటని ప్రశ్నించారు. 1.91 లక్షల ఖాళీలు ఉండగా.. 56 వేలు దాటడం లేదన్నట్టు దొంగ లెక్కలేంటి అని నిలదీశారు. వివిధ కార్పొరేషన్లలో ఖాళీల సంఖ్య లెక్క తీయాలన్నారు. అన్నింటి పైనా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News