Tuesday, April 23, 2024

పారిశుద్ధ్య కార్మికులకు పరిహారం ఇవ్వాలిః రేవంత్ డిమాండ్

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే హైదరాబాద్‌లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌ శివారులోని సాహెబ్‌నగర్ డ్రైనేజీలో పూడిక తీస్తూ మృతి చెందిన కార్మికులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సాహెబ్‌నగర్‌లో పారిశుద్ధ్య పనులు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన శివ, అంతయ్య కుటుంబాలను రేవంత్‌ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. సోమవారంలోగా పరిహారం చెల్లించకపోతే జాతీయ స్థాయిలో అన్ని విభాగాలకు ఫిర్యాదు చేస్తానని.. అప్పుడు సంబంధిత అధికారులు ఢిల్లీకి తిరగాల్సి వస్తుందని హెచ్చరించారు.

బాధిత కుటుంబసభ్యుల ఇళ్ల వద్ద నుంచే ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌ ఉపేందర్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన రేవంత్‌.. కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఎస్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇప్పటివరకు సమీక్ష చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. మ్యాన్‌హోల్‌లో మనుషులను దింపి పనిచేయించడం నిబంధనలకు విరుద్ధమని.. ఎలా దింపారని జోనల్ కమిషనర్‌ను నిలదీశారు. అధికారులు, కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసులు పెట్టి లోపల వేయాలని రేవంత్‌ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు కలెక్టర్‌తోనైనా మాట్లాడి పరిహారం అందేలా చూడాలని సూచించారు.

ఇది కూడా చదవండిః ఉపఎన్నిక షెడ్యూల్ పై పార్టీలకు సంకేతాలందాయా?

Advertisement

తాజా వార్తలు

Advertisement