Saturday, December 7, 2024

Respond – రైతు అత్మ‌హ‌త్య‌పై స్పందించిన రేవంత్ … విచార‌ణ‌కు ఆదేశం

ఖమ్మం జిల్లాకు చెందిన రైతు ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతు ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇప్పటికే ప్రభాకర్ మృతిపై పలువురు మంత్రులు స్పందించి.. విచారణ వేగవంతం చేయాలని ఆదేశించగా.. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సైతం రెస్పాండ్ కావడంతో ప్రభాకర్ సూసైడ్ ఇష్యూను పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా, ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దటూరుకు చెందిన ప్రభాకర్ అనే రైతు తన భూమిని కొందరు కబ్జా చేశారని.. పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదనతో సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం ప్రభాకర్ సూసైడ్‌పై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement