Sunday, September 24, 2023

సీపీకి కృతజ్ఞతలు తెలిపిన.. అశోకకాలనీ వాసులు

ప్లాట్లలో ఇండ్ల నిర్మాణం చేపట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తూ భూ అక్రమణకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి బాధితులకు సత్వర న్యాయం చేసినందుకు అశోకకాలనీ వాసులు.. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ని మర్యాదపూర్వకంగా కలిసి .. పుష్పాగుచ్చాలను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. గత కొద్దికాలంగా సుబేదారిలో పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోకకాలనీలో ఒకే ప్రాంతంలో 20మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. కాగా ఈ ప్రాంతానికి చెందిన కేశబోయిన శివ, కేలోతు నవీన్ అనే ఇద్దరు వ్యక్తులు ఖాళీ ఇండ్ల స్థలంలో ఇండ్ల నిర్మాణ సమయంలో వ్యక్తులు వచ్చి నిర్మాణ పనులు నిలిపివేసి ఈ భూములు తమ తాతలు సంపాదించినవని, ఇవి ఎవరికి విక్రయించలేదని స్థల యజమానులను బెదిరింపులకు పాల్పడటమే కాకుండా లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్న సంఘటనలపై అశోకకాలనీ వాసులు పోలీస్ కమిషనరు ఫిర్యాదు చేయడంతో.. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసుల అధ్వర్యంలో భూమి పూర్వపరాలు పరిశీలించారు. దర్యాప్తు చేసిన అనంతరం భూమి ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులదేనని నిర్ధారణయింది. దీంతో ఇద్దరు భూఆక్రమణదారులపై సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసారు. పోలీస్ కమిషనరుని కలిసిన వారిలో కాలనీవాసులు చింతం శ్రీనివాస్, బల్లూరి సంజీవరావు, ఇట్టబోయి సుధాకర్ వున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement