Tuesday, March 19, 2024

రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెట్ – ఆసుపత్రి సిబ్బంది అరెస్ట్

ఖమ్మం – విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ రామానుజం ఆధ్వర్యంలో సిఐ వేణు మాధవ్ , ఎస్సై సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి చెందిన రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్ విక్రయిస్తున్న ఆసుపత్రి సిబ్బందిని ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సమీపంలో నిఘా పెట్టి రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను పట్టుకున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు ఉపయోగించాల్సిన (06 )రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను ప్రభుత్వ ఆసుపత్రిలోని స్టాఫ్ నర్స్ మరో ఇద్దరు ఔట్ సోర్స్ ఉద్యోగులను బ్లాక్ మార్కెట్ 38 వేలకు ఇంజెక్షన్ విక్రయిస్తున్న సమయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అకస్మాత్తుగా దాడి చేసి పట్టుకున్నారు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement