Friday, October 4, 2024

CMRF: వ‌ర‌ద బాదితుల‌కు రిల‌య‌న్స్ రూ.20కోట్ల విరాళం

హైద‌రాబాద్ – తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు అతలాకుతలమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల పునరుద్ధరణ నిమిత్తం పలువురు ప్రముఖులు విరాళాలు అందజేస్తున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సీఎంఆర్ఎఫ్ కు రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్ల విరాళం అందజేసింది. ఈ మేరకు నీతా అంబానీ తరపున రిలయన్స్ ప్రతినిధులు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ ఈ బృందాన్ని అభినందించారు.. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement