Saturday, April 20, 2024

రవీందర్‌సింగ్‌ ఆరోపణలు సిగ్గుచేటు – టీఆర్ఎస్ కౌన్సిలర్లు

పెద్దపల్లి, (ప్రభ న్యూస్‌) : పార్టీ సూచించిన అభ్యర్థులకే తమ పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని పెద్దపల్లి టీఆర్ఎస్ కౌన్సిలర్లు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక అమర్‌చంద్‌ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కౌన్సిలర్‌ ఉప్పు రాజు మాట్లాడుతూ…. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు భానుప్రసాద్‌రావు, ఎల్‌.రమణలకే తమ మద్దతు ఉంటుందన్నారు. మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ అసత్యపు ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. ఉద్యమకారుడిగా రవీందర్‌సింగ్‌ అంటే తమకు గౌరవం ఉందని, అయితే పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వకపోవడంతో ముఖ్యమంత్రితోపాటు ఎమ్మెల్సీ అభ్యర్థులతో ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు.

రవీందర్‌సింగ్‌కు కరీంనగర్‌ మేయర్‌గా పార్టీ అవకాశమిచ్చిందన్నారు. భానుప్రసాద్‌రావు అందుబాటులో ఉండడని ఆరోపించడం సరైంది కాదని, 2008 నుంచి ఎమ్మెల్సీగా ఉమ్మడి జిల్లాలో అనేక సేవలందిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ నిధుల నుంచి రవీందర్‌సింగ్‌కు సైతం రూ. 5లక్షలను కేటాయించారని, అది మరిచిపోయి మాట్లాడడం సరికాదన్నారు. కౌన్సిలర్‌ కృష్ణమూర్తి మాట్లాడుతూ… పార్టీ అభ్యర్థులకే సహకారం అందిస్తామని, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సూచనలు పాటిస్తామన్నారు. కొలిపాక శ్రీనివాస్‌ కౌన్సిలర్ల సంఘం అధ్యక్షుడినని చెప్పుకోవడం సరైంది కాదని, తామెవరిని ఎన్నుకోలేదన్నారు. పెద్దపల్లి కౌన్సిలర్ల పూర్తి మద్దతు తెరాస అభ్యర్థులకే ఉంటుందన్నారు. కౌన్సిలర్‌ భిక్షపతి మాట్లాడుతూ… తెరాస అభ్యర్థుల గెలుపు ఖాయమైపోయిందని, రవీందర్‌సింగ్‌ను వెనకుండి ఎవరు మాట్లాడిస్తున్నారో అందరికి తెలుసన్నారు. తెరాస నాయకులు సాబీర్‌ ఖాన్‌ మాట్లాడుతూ… 12 ఏళ్లుగా ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు అందరికి అందుబాటులో ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు సరేశ్‌, హన్మంతు, సోనీ శ్రీకాంత్‌, కార్తీక్‌, ఖదీర్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement