Friday, November 29, 2024

RR: జన్వాడ, మీర్జాగూడ గ్రామాలకు శంకర్ పల్లి మండలంతో బంధం వీడనున్నదా…?

శంకర్పల్లి, ఆగ‌స్టు 1 (ప్రభ న్యూస్) : శంకర్ పల్లి మండలంతో జన్వాడ, మీర్జాగూడ గ్రామాలకు బంధం వీడనున్నదా, రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసి పరిధిని పెంచే క్రమంలో, శంకర్ పల్లి మండలంలోని జన్వాడ, మీర్జాగూడ గ్రామాలను జిహెచ్ఎంసి లో కలుపుతున్నారని సమాచారం వస్తూ ఉండటంతో ఆ గ్రామాల్లో ఏమి జరుగుతుందో అనే ఆలోచన ప్రజల్లో తచ్చాడుతోంది. 2011 సెన్సస్ లెక్కల ప్రకారం జన్వాడలో 4151 పాపులేషన్ ఉండగా, మిర్జాగూడ అనుబంధ గ్రామాలైన మియాఖాన్ గడ్డ, ఇంద్రారెడ్డి నగర్ లను కలుపుకొని 2200 పాపులేషన్ ఉండింది.

ప్రస్తుతం దాదాపు జన్వాడ గ్రామంలో 6500, మీర్జాగూడ అనుబంధ గ్రామాలు కలుపుకొని 8000 పాపులేషన్ ఉన్నట్లు స్థానికంగా సమాచారం అందుతుంది. వీరిని జిహెచ్ఎంసి లో కలిపే ప్రక్రియలో నూతన మున్సిపాలిటీగా మారుస్తారా, లేక దగ్గరలో ఉన్న మున్సిపాలిటీకి ఈ గ్రామాలను కలుపుతారా, గ్రామపంచాయతీలుగానే కొనసాగిస్తారా, అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా వందల సంవత్సరాల నుండి, హైదరాబాద్ మహానగరానికి దగ్గరలో ఉన్న జన్వాడ, మీర్జాగూడ, ప్రజల అవసరాలు, ఆర్థిక వ్యవహారాలు, అనుబంధాలు, అన్ని శంకర్ పల్లితో మమేకమై ఉండగా, రాబోయే రోజుల్లో ఏం మార్పులు వస్తాయో, ఎలా ఉండబోతుందో, అని ఆయా గ్రామాల ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement