Thursday, March 28, 2024

వ్యాక్సిన్‌ వేయించుకున్న కౌన్సిలర్..

తాండూరు : టీకా వేసుకోవడంతో కరోనాకు అడ్డుకట్ట వేయవచ్చని తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న పరిమళ్‌ అన్నారు. తాండూరు పట్టణంలోని జిల్లా ఆసుపత్రి పీపీ యూనిట్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్‌ లో చైర్‌పర్సన్‌ స్వప్న కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ వేసుకున్నారు. ఆమెతో పాటు కౌన్సిలర్లు నీరజాబాల్‌రెడ్డి, ప్రవీణ్‌గౌడ్‌, వెంకన్నగౌడ్‌, సంగీత ఠాకూర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు బాల్‌రెడ్డి తదితరులు కూడ టీకా వేసుకున్నారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ స్వప్న మాట్లాడుతూ కరోనా మహామ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు టీకాలు ప్రవేశ పెట్టాయన్నారు. ప్రజా ప్రతినిధులతో పాటు 45 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలన్నారు. మొదటి డోస్‌ వేసుకున్న 28 రోజుల తరువాత రెండో వేసుకోవాలన్నారు. టీకా వేసుకోవడంతో కరోనాను అడ్డుకట్ట వేయవచ్చన్నారు. అదేవిధంగా ప్రజలు మాస్కులు, శానిటైజర్‌, భౌతిక దూరం పాటింపు వంటి నిబంధనలు పాటిస్తే కట్టడి చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ముక్తార్‌ నాజ్‌, రాము, నాయకులు, మున్సిపల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement