Thursday, December 5, 2024

తెరాస ప్ర‌భుత్వం పేద‌ల సంక్షేమం కోసం ప‌నిచేస్తోంది : ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

కుత్బుల్లాపూర్ : బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో బాధ పడుతున్న మల్లంపేట్ గాజుల బస్తీకి చెందిన‌ ఎం.సత్తయ్యకు చికిత్స చేయించుకునేందుకు మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు రూ.3 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎల్ఓసీ అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ యాదవ్, దుండిగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మారావు, కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు హన్మంతరావు, పోలీస్ గోవింద్ రెడ్డి, మురళి యాదవ్, భీమ్ సింగ్, విష్ణువర్ధన్ రెడ్డి, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement