Sunday, October 13, 2024

చెట్టుకు ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య

ధరూర్ : చెట్టుకు ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండల పరిధిలోని చింతకుంట గ్రామ సమీపంలో పక్కనే ఉన్న అడవిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి గ్రామస్తులు కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చింతకుంట గ్రామానికి చెందిన జోగు హరీష్ 18 గత వారం రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లి పోయాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో తన ఫోన్ కు ఫోన్ చేసినా కూడా ఫోన్ స్విచాఫ్ రావడంతో బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. శుక్రవారం రోజు ఉదయం అదే గ్రామానికి చెందిన మహేష్ తన ఎత్తు కోసం అడవిలో నుంచి అటుగా వెళ్తుండగా చెట్టుకు వేలాడుతున్న శవాన్ని చూసి గ్రామస్తులకు సమాచారమిచ్చాడు. గ్రామస్తులు హరీష్ కుటుంబీకులకు సమాచారమివ్వడంతో ఘటనా స్థలానికి వెళ్లి చూడగా చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు వారి అబ్బాయి అని గుర్తించారు. వెంటనే గ్రామ సర్పంచ్ కి సమాచారం ఇవ్వడంతో సర్పంచ్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి ఎస్సై నరేందర్ ఏఎస్ ఐ మల్లయ్య సిబ్బందితో స్థలానికి చేరుకున్నారు. చెట్టుకు ఉరి వేసుకున్నహరీష్ శవాన్ని పరిశీలించి అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేందర్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement