Tuesday, October 8, 2024

శ్రీ రక్షా కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అన్నదానం

వికారాబాద్ (ప్రభ న్యూస్): ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఎన్టీఆర్ చిత్రపటానికి శ్రీ రక్షా కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ మాట్లాడుతూ విశ్వవిఖ్యాత ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు బడుగు బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన మహానేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో మురళి శ్రీ రక్ష కన్స్ట్రక్షన్స్ సిబ్బంది మాజీ టిడిపి నాయకులు లక్ష్మణరావు ఆకుల రమేష్ శాంతప్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement