శంషాబాద్‌లోని రాజీవ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. దుబాయి నుంచి వచ్చిన ఓ మహిళ నుంచి 250 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. బంగారంపై వెండిపూత పూసి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పట్టుకున్న బంగారం విలువ దాదాపు పదిలక్షలకు పైగా ఉంటుందని సమాచారం.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో 250 గ్రాముల బంగారం పట్టివేత

Previous articleనేటి సంపాదకీయం – ఆత్మవిమర్శ… ఆత్మ విశ్వాసం..!
Advertisement
తాజా వార్తలు
Advertisement