Wednesday, April 24, 2024

బస్సులు నిండుగా జనం.. ఉంటేనే నడుపుతాం

షాద్‌నగర్‌ : ప్రయాణికులు బస్సులో నిండుగా ఉంటనే నడుపుతాం లేకుంటే రద్దు చేస్తామంటూ షాద్‌నగర్‌ డిపో మేనేజర్‌ శివశంకర్‌ అన్నారు. కరోనా నేపథ్యంలో బస్సులో ప్రజలు ఎక్కువగా ప్రయాణించడం లేదని అందువల్ల ఆర్టీసి నష్టం చేకూరుతుందని అన్నారు. ప్రజా సంక్షేమం ముఖ్యం కాదు ఆర్టీసీ సంక్షేమం ముఖ్యమని అన్నారు. ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురైన సమయపాలన పాటించే పనిలేదు. ఆర్టీసికి లాభం వచ్చినప్పుడే బస్సులు నడుపుతామని అన్నారు.
ప్రజల కష్టాలకు ఎవరు బాధ్యులు..
సమయ పాలన పాటించని ఆర్టీసి బస్సులు ఇష్టానుసారంగా నడిపిస్తే ప్రజల సమయ పాలన వల్ల ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసి బస్సులకు ప్రైవేట్‌ బస్సులకు తేడా ఏముందని అన్నారు. ఆర్టీసి ప్రభుత్వంతో ఎన్నో రకాల రాయితీలను పొంది కూడ ప్రజలకు ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. ఆర్టీసి నష్టాల్లో ఉందంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎన్నో కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఒక్క పక్క కాపాడుతుంటే ఆర్టీసి మాత్రం నిబంధనలను పాటించకుండా ప్రజల సౌకర్యాలకు గండీ కొడుతూ లాభేక్ష్య లేకుండా నడిపిస్తున్న కూడ ఆర్టీసి ఎందుకు నష్టాల్లో ఉందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇవే సౌకర్యాలు ప్రైవేట్‌ బస్సు యజమాన్యాలకు అప్పగిస్తే మెరుగైన సౌకర్యాలు అందిస్తారని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఆర్టీసిపై ప్రభుత్వం గట్టి నిఘా వేస్తేనే ప్రజల సౌకర్యాలు కల్పిస్తారని అంటున్నారు.
శానిటైజర్‌ ఎక్కడ..
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల బాగోగుల ఆర్టీసి పట్టించుకోకుండా లాభాలు బాగానే చూస్తున్నారు తప్పా. బస్సుల్లో శానిటైజర్‌ చేయకుండా అపరిశుభ్రంగా బస్సులు నడపడంతో ప్రజల ప్రాణాలతో జలకాలట ఆడుతున్నారు. బస్సులలో శానిటైజర్‌ చేయకుండా నడిపిస్తున్నారని కింది స్థాయి సిబ్బంది చెబుతున్నా కూడ ఆర్టీసి యజమాన్యం పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఎన్నో వస్తున్నాయి. ఈ విషయంపై ఆర్టీసిపై విజిలెన్స్‌ విభాగాన్ని దృష్టి పెట్టిస్తే తప్ప ఆర్టీసి సరిగ్గా నడవదని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పని చేయాలి కానీ ఆర్టీసి మాత్రం డబ్బులు ఖర్చు చేయకుండా ప్రజలకు కరోనా అంటించే విధంగా ఆర్టీసి వ్యవహరిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజల ప్రాణాల కోసం అన్ని రకాల సదుపాయాలను అందిస్తు కరోనా కాటు నుండి ప్రజలను రక్షించేందుకు శాయశక్తుల కృషి చేస్తుంటే ఆర్టీసి అధికారులు మాత్రం దానికి బిన్నంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్ని ఏళ్లుగా కూడ ప్రజల సౌకర్యాలు తీర్చలేక పోవడమే కాకుండా నష్టాలు చూపించడం ఆర్టీసి పని అయ్యిందని.. ప్రభుత్వం స్పందించి ఆర్టీసిపై చర్యలు చేపట్టాలని ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement