Friday, March 29, 2024

రాజన్న రాజ్యంతో సుపరిపాలన

మూడోవ రోజుకు చేరిన షర్మిల పాదయాత్ర
అందరిని పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటూ ముందుకు
గ్రామాల్లో మహిళలతో మాటామంతీ
గొల్లపల్లి శివార్లలో బస..
13కిలో మీటరల్ల మేర కొనసాగిన పాదయాత్ర

(ప్రభన్యూస్‌బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి):శంషాబాద్‌ పట్టణంలో షర్మిల మాట్లాడుతూ కేసీఆర్‌ ఎన్నో అబద్ధపు హామీలతో జనాన్ని వెూసం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ గ్రామంలో ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ లేదు.. తన బిడ్డను చదివించుకోకలేపోతున్నానని ప్రతి తల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. బంగారు తెలంగాణ కాదు.. బీర్ల తెలంగాణ బార్ల తెలంగాణగా మారిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు ఇప్పుడు ఉద్యోగాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు పావలా వడ్డీ రుణాల మాటే లేదన్నారు. తెలంగాణలో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం సాధ్యమవుతుందని ఆమె చెప్పారు.
ప్రజాప్రస్థానం పేరుతో షర్మిల చేపట్టిన పాదయాత్ర మూడోవరోజుకు చేరింది. దారిపొడుగునా మహి ళలు, పురుషులు, యువకులు, పిల్లలను ఆప్యా యంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఓపిక పట్టండి మన కష్టాలు తీరిపోతాయని భరోసా ఇస్తున్నారు. మూడోవరోజు శంషాబాద్‌ మండలం కాచారం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. నర్కూడ, రాళ్లగూడ, శంషాబాద్‌ మీదుగా రాత్రికి గొల్లపల్లికి చేరింది. శంషాబాద్‌ చౌరస్తాలో బాబా సాహెబ్‌ అంబద్కర్‌కు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. దారి పొడువునా బస్సుల్లో వెళ్లే వారిని ఆటోలో వెళ్లేకూలీలను పలకరించారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలు, పెద్దలు షర్మిలతో సెల్ఫీలు దిగేందుకు (మొదటిపేజీ తరువాయి)
ఆసక్తి చూపించారు. తెలంగాణలో మార్పును తీసుకువచ్చేందుకు ప్రజా ప్రస్థానం పేరుతో ఈనెల 20వ తేదీన వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తన తండ్రికి సెంటిమెంట్‌ ప్రాంతమైన చేవెళ్ల గడ్డ మీదనుంచే తాను కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మొదటి రెండురోజులు చేవెళ్ల, మొయినాబాద్‌ మండలాల్లో పాదయాత్ర కొనసాగింది. మూడవరోజు శుక్రవారం శంషాబాద్‌ మండలంలో పాదయాత్ర చేశారు. ప్రధాన రహదారి కావడంతో పలు ప్రాంతాల్లో షర్మిలను చూసేందుకు జనం వేచి చూశారు. తన కోసం ఎదురుచూస్తున్న వారిని ఆమె ఆప్యాయంగా పలకరించారు. పింఛన్లు, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. నర్కూడ గ్రామంలో తన కోసం ఎదురుచూస్తున్న మహిళలకు షర్మిల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పిల్లలు పోటీపడ్డారు. వారిని నారాజ్‌ చేయకుండా తానే సెల్ఫీ తీసుకున్నారు. కూలీలు కూడా షర్మిలను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. తనను కలిసివాళ్లు కష్టాలు చెప్పుకున్నారు. మన కష్టాలన్నీ పోతాయి కాస్త ఓపిక పట్టండి అంటూ షర్మిల ముందుకు సాగుతున్నారు. మూడవ రోజు 13 కిలోమీటర్లమేర పాదయాత్ర కొనసాగింది. గొల్లపల్లిలో షర్మిల బస చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement