Thursday, March 28, 2024

VKB | నకిలీ విత్తనాలు ఆరికట్టడానికి ప్ర‌త్యేక త‌నిఖీలు.. వికారాబాద్‌లో జిల్లాలో నాకబందీ

వికారాబాద్ (ప్రభ న్యూస్): నకిలీ పత్తి విత్తనాల రవాణా అరికట్టేందుకు జిల్లాలో అకస్మాత్తుగా నాకాబందీ నిర్వహించినట్టు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలలో ఒకే సమయానికి ఆకస్మాత్తుగా ఆదివారం నాకాబందీ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. దీనికి రైల్వే స్టేషన్ లు కల్గిన పోలీస్ స్టేషన్ లలో తనికీలు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో అక్రమ రవాణాలను అరికట్టడమే లక్ష్యం గా ముఖ్యంగా నకిలీ విత్తనాలు, కల్తీ మద్యం, ఇతర రాష్ట్ర ల నుండి మద్యం అక్రమ రవాణా చేస్తున్న నేరస్తులపై ప్రత్యేక నిఘా పెట్టిన‌ట్టు తెలిపారు. జిల్లాలో చోరీ లను నివారించి, అక్రమ కార్యకలపాలపైనా ప్రత్యేక నిఘా నే లక్ష్యం గా నాకాబందీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

వర్షాకాలం వస్తునందున రైతులకు నకిలీ విత్తనాల నుండి కాపాడుట కొరకు నకిలీ విత్తనాల రవాణాను అరికాట్టడం కొరకు నాకాబందీ ఏర్పాటు చేయడం జరిగిందని, నాకాబందీ కార్యక్రమం జిల్లాలో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే సమయంలో త‌నిఖీలు నిర్వహించడం జరిగింద‌న్నారు. నాకాబందీ లో భాగంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 1515 వాహనాలు తనిఖీ చేయడం జరిగిందని, అందులో ద్వి చక్ర వాహనాలు 553, త్రిచక్ర వాహనాలు 153, ఫోర్ వీల‌ర్స్ 588. ఇతర వాహనాలు 221 ఉన్నాయి. ఇందులో 15 వాహనాలు సిజ్ చేయడం జరిగింద‌ని కోటిరెడ్డి తెలిపారు. జిల్లాలో ఎప్పుడైనా నాకాబందీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని, నేరాలను నియంత్రించడం, అక్రమ రవాణాను అరికట్టడం, అక్రమ కార్యకలాపాలపైన ప్రత్యేక నిఘా, నేరస్థుల కదలికపైన ప్రత్యేక నిఘా నాకాబందీ ముఖ్య ఉద్దేశంగా ఎస్పీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement