Wednesday, April 17, 2024

VKB | వికారాబాద్‌లో గ్రీన్ ర్యాలీ.. పాల్గొన్న మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్‌

వికారాబాద్, (ప్రభ న్యూస్): పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల అన్నారు. సోమవారంప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని పర్యావరణంపై అవగాహన కోసం ర్యాలీ నిర్వ‌హించారు. ఈ గ్రీన్ ర్యాలీని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.


పర్యావరణం బాగుంటేనే మనందరం బాగుంటామని, పర్యావరణాన్ని కాపాడడంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా నడుచుకోవాలని అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, మున్సిపల్ శాఖ సంయుక్తంగా వికారాబాద్ పట్టణంలోని సినిమాక్స్ థియేటర్ దగ్గర నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు గ్రీన్ ర్యాలీ నిర్వ‌హించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement