Thursday, May 6, 2021

ప్రతి ఒక్కరికి కోవిడ్‌ టీకా..

మేడ్చల్‌ : కోవిడ్‌ టీకాను ప్రతి ఒక్కరు వేయించుకోవాలని మేడ్చల్‌, గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ చైర్మన్‌లు మర్రి దీపిక నర్సింహారెడ్డి, మద్దుల లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మేడ్చల్‌, గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ పరిధిలోని చైర్‌పర్సన్‌ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు కోవిడ్‌ టీకాను వేయించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ లు మర్రి దీపిక నర్సింహారెడ్డి, మద్దుల లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కరో నా సెకండ్‌ వేవ్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రతి ఒక్కరు మాస్క్‌ శానిటైజర్‌ భౌతిక దూరం పాటించాలని కోరారు. గుండ్లపోచంపల్లి పరిధిలో 156 మంది మున్సిపల్‌ సిబ్బంది శనివారం టీకా వేయించుకున్నారని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌లు సత్యనారాయణరెడ్డి, అమరేందర్‌రెడ్డి, మున్సిపల్‌ సిబ్బంది శ్రీనివాస్‌ గౌడ్‌, శానిటేషన్‌ ఇన్స్‌ఫెక్టర్‌ రాంచందర్‌, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News