Sunday, April 11, 2021

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన కర్తవ్యం..

కుత్బుల్లాపూర్‌ : నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన కర్తవ్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్సీని కలిసేందుకు వివిధ ప్రాంతాల నుండి కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు, నాయకులకు తన నివాసం వద్ద ఉన్న కార్యాలయంలో అందుబాటులో ఉంటూ స్వయంగా వారి సమస్యలను తెలుసుకుంటూ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించేందుకు తనవంతు కృషి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News