Wednesday, January 19, 2022

మాతృమూర్తికి నివాళులర్పించిన మంత్రి స‌బితారెడ్డి

తాండూరు రూర‌ల్ : తాండూరు నియోజకవర్గ పరిధిలోని కోట బాస్పల్లి గ్రామంలో మాతృమూర్తి స్వర్గీయ జి.వెంకటమ్మ 5వ వర్థంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర‌ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాళులర్పించారు. శుక్ర‌వారం సోదరులు నరసింహ్మ రెడ్డి, సోదరీమణి సద్గుణమ్మల‌తో కలిసి తల్లిదండ్రులు స్వర్గీయ వెంకటమ్మ మహిపాల్ రెడ్డి ల‌ సమాధుల వద్ద మంత్రి స‌బితారెడ్డి నివాళులర్పించారు. అనంత‌రం త‌ల్లి వర్థంతి సందర్భంగా పేదలకు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ మండ‌ల అధ్య‌క్షులు రాందాస్, నాయ‌కులు శేఖ‌ర్, మ‌హిళ నాయ‌కురాలు శ‌కుంత‌ల‌, స‌ర్పంచులు రాములు, న‌రేంద‌ర్ రెడ్డి, ప‌ట్లోళ్ల న‌రేంద‌ర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీలు మొగుల‌ప్ప‌, శేఖ‌ర్, ఉపాధ్యాయ నేత‌లు న‌ర్సిరెడ్డి, నాగ‌ప్ప‌, కిష్ట‌ప్ప‌, శ‌శిధ‌ర్, నేత‌లు కోట్రిక కిర‌ణ్ కుమార్, శేఖ‌ర్ గౌడ్, సిటీకేబుల్ మేనేజర్ నారాయ‌ణ, త‌దిత‌రులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News