Tuesday, March 26, 2024

వికారాబాద్ లో బుక్స్ ఆన్ డిమాండ్ ను ప్రారంభించిన మంత్రి సబితారెడ్డి

వికారాబాద్ జిల్లా లైబ్రరీలో నిరుద్యోగ యువతీ యువకులకు పోటీ పరీక్షలకు ఉద్దేశించి బుక్స్ ఆన్ డిమాండ్ కార్యక్రమానికి రాష్ట్ర‌ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని ఎంపిక చేసిన 110 గ్రంథాలయాల్లో పోటీ పరీక్షల అభ్యర్థులకు పూర్తి స్థాయి మెటీరియల్ ను అందుబాటులో ఉంచడంతో పాటు కోరుకున్న పుస్తకాలు సమకూర్చేలా విన్నూత్న కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా కేంద్రంలో విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత కోసం ఒకే సారి 90 వేల ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలనీ ఆమె పిలుపునిచ్చారు. పోటీ పరీక్షల కోసం రాష్ట్రంలోని 110 గ్రంథాలయాల్లో పుస్తకాలు సిద్ధంగా ఉంచుతున్నట్లు, నిరుద్యోగ యువత, పాఠకుల కోరిక మేరకు బుక్స్ ఆన్ డిమాండ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఏ పుస్తకం కావాలో లైబ్రరీయన్ కు తెల్పితే త్వరితగతిన సమకూర్చడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాల్లో ఉచిత శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, మహేశ్వర్ రెడ్డి, యాదయ్య, పైలట్ రోహిత్ రెడ్డి, కలెక్టర్ నిఖిల, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీ కృష్ణ,ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement