Wednesday, January 19, 2022

రైతుబంధు సంబ‌రాల్లో మంత్రి స‌బితా రెడ్డి

మహేశ్వరం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి హాజరయ్యారు. అంతకు ముందు మన్సాన్ పల్లి చౌరస్తా నుంచి మహేశ్వరం వరకు రైతులతో కలిసి ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. సమావేశానికి ముందు కేసీఅర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రభుత్వానికి వ్యతిరేఖంగా మాట్లాడేవారికి కూడా ప్రభుత్వం నుంచి నేరుగా పింఛ‌న్లు, రైతు బంధు, రైతు భీమా డబ్బులు పడుతున్నాయని చలొక్తిగా మాట్లాడారు. ఈ రైతు బంధు సంబరాల్లో జిల్లా అధికారులు, పార్టీ నాయకులు, పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News