Wednesday, March 29, 2023

దళితబంధు లబ్ధిదారుల సదస్సులో పాల్గొన్న‌ మంత్రి మల్లారెడ్డి

ద‌ళిత బంధు ల‌బ్ధిదారుల‌కు అవ‌గాహ‌స స‌ద‌స్సు నిర్వ‌హించారు. ఈ స‌ద‌స్సుకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి హాజ‌ర‌య్యారు. తెలంగాణ ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మ‌కంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం పైలెట్ ప్రాజెక్టు కింద నియోజకవర్గానికి 100మందిని ఎంపిక చేయడం జరిగింది. మేడ్చల్, ఉప్పల్ నియోజకవర్గాల్లో ఎంపికైన వారికి జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో నాగారం మున్సిపాలిటీ పరిధిలోని స్టార్ ఫంక్షన్ హల్ లో దళిత బంధు అవగాహనా సదస్సు నిర్వ‌హించారు. ఈ స‌ద‌స్సులో మంత్రి మల్లారెడ్డితో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ జాన్ శాంసన్, మున్సిపల్ చైర్మన్లు చంద్రారెడ్డి, ప్రణిత గౌడ్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -
   

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement