Friday, March 29, 2024

ప్ర‌మాదంలో వ్య‌క్తి మృతి : టీఆర్ఎస్ నేత‌ల ఆర్థిక సాయం

వికారాబాద్ : వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు వడ్ల నందు వికారాబాద్ మండలం, మదనపల్లి గ్రామానికి చెందిన కొల్లూరు కృష్ణయ్య ప్రమాదవశాత్తు మరణించగా ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. విద్యుత్ శాఖలో రోజువారి కూలి చేసుకొని, నిన్న రాత్రి బైక్ పై వెళ్తుండ‌గా… యాక్సిడెంట్ జ‌రిగి ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. కుటుంబాన్ని పరామర్శించి దహాన సంస్కారం చేయడానికి ఆర్థిక సహాయం చేసి మృతుని కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ విజయ రాజు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సిరియాలు, గ్రామస్తులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement