Monday, December 9, 2024

స్కూటీని ఢీకొట్టిన లారీ – ముగ్గురికి తీవ్రగాయాలు

  • తాండూరు : వేగంగా దూసుకొచ్చిన లారీ పిల్లలను స్కూల్లో దించేందుకు వెళుతున్న ఓ స్కూటీని ఢీకొని.. ఏకంగా స్కూటీ పైకి ఎక్కింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న వృద్ధుడు, ఇద్దరు చిన్నారులకు ప్రాణాయపాయం తప్పినా… ఓ చిన్నారికి కాలు విరిగి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన తాండూరు పట్టణం శివాజీ చౌరస్తాలో చోటు చేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మున్సిపల్ పరిధి మాణిక్ నగర్ కు చెందిన అబ్దుల్ ఖాదీర్(70) ఈరోజు ఉదయం మహబూబ్ మియా కూతురు నుస్రత్ ఫాతిమా(9), అర్మాన్ (7)లను పట్టణంలోని శివాజీ చౌరస్తా సమీపంలో ఉన్న నారాయణ స్కూల్ లో దించేందుకు స్కూటీపై బయల్దేరాడు. శివాజీ చౌరస్తా వద్ద మలుపు తీసుకుంటుండగా ఇందిరా చౌరస్తా నుంచి గౌతాపూర్ వైపు వెళుతున్న లారీ(ఎంహెచ్ 26 బీఈ 3040) వేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టింది. స్కూటీ హ్యాండిల్ ధ్వంసమై లారీ కిందకు వెళ్లింది. స్కూటీని లారీ ఢీకొట్టే క్రమంలో ఖాధీర్ అప్రమత్తమై స్కూటీపై నుంచి పక్కకు జరిగాడు. అప్పటికే స్కూటీపై ఉన్న నుస్రత్ కాలు విరిగి తీవ్రగాయాలయ్యాయి. అర్మాన్ కాలుకు కూడా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితులను వెంటనే స్థానికంగా ఉన్న బాలాజీ ఆసుపత్రికి తరలించారు.

  • రోడ్డుపై బైటాయించిన నాయకులు :

రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, ఎన్ ఎస్ యూఐ తాండూరు అధ్యక్షులు సందీప్ రెడ్డి తదితరులు ప్రమాదానికి గురైన లారీ ముందు బైటాయించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పిల్లలు పాఠశాలలకు వెళ్లే సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ప్రశ్నించారు. ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి ప్రయత్నం చేశారు. మరోవైపు రోడ్డుపై లారీ ఆగిపోవడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జాం అయ్యింది. చేరుకుని ఆందోళన కారులకు నచ్చజెప్పేప్ర‌య‌త్నం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement