Saturday, March 23, 2024

హెల్త్‌కేర్‌ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే..

నిజాంపేట : మండల కేంద్రమైన నిజాంపేటలో హెల్త్‌కేర్‌ ఫార్మసీ సెంటర్‌ ను మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ కరోనా ప్రోటోకాల్‌ పాటించాలని సూచించారు. అత్యవసర సమయంలో మాత్రమే బయటకు రావాలని బయటకి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ.. శానిటైజర్‌ ఉపయోగించుకోవాలని అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నారు.. కరోనా వ్యాక్సిన్‌ ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉండవని ..కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ జయరాములు, గ్రామ సర్పంచ్‌ అనూష, ఎంపిటిసి లహరిరెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షులు అమరసేనారెడ్డి, ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు కొమ్మాట బాబు, మండల కోఅప్షన్‌ మెంబర్‌ ఎండీ గౌస్‌, తెరాస మండల అధ్యక్షులు సుధాకర్‌రెడ్డి, తెరాస నాయకులు పప్పుల కృష్ణారెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ఎదగని వెంకటేశం, పంజా మహేందర్‌, మాజీ సర్పంచ్‌ వడ్ల తిరుమలయ్య, మల్లేశం, చంద్రయ్యరెడ్డి, శెట్టి రవి, చంద్రయ్య, గేమ్‌సింగ్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement