Wednesday, April 24, 2024

ఘనంగా కొలన్ లీడర్ నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు

నిత్యం జనం మధ్యలో ఉండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ… అందరికీ అందుబాటులో నేనున్నానంటూ అందరి శ్రేయస్సు కోరుకునే లీడర్ కొలన్ నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆయనకు శివరాం మిత్ర మండలి తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేయించారు. ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఎప్పటికీ జరుపుకోవాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని నిజాంపేట్ శివరాం మిత్ర మండలి స‌భ్యులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో శివరాం మిత్ర మండలి సభ్యులు గుంటుపల్లి వంశీకృష్ణ, ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి, కోటపాటి రమేష్, పావులూరి సుబ్బారావు, తూమాటి శశి, కాటేపల్లి హరి, గంటా శరత్, అబ్బూరి సాయి, నాగరాజు పాల్గొన్నారు. అలాగే అబ్బూరి శేఖర్, నేలపాటి కరుణాకర్, ధూళిపాళ్ల రాజేష్, శివరాం మిత్ర మండలి సభ్యులు, తదితరులు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement