Thursday, April 25, 2024

అందత్వ రహిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి మల్లారెడ్డి

అందత్వ రహిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం శామీర్పేట్ మండలం అలియాబాద్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట వ్యాప్తంగా అందత్వ నివారణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోదని పేర్కొన్నారు. కంటి వెలుగు ఒక అద్భుత కార్యక్రమమని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం దేశానికి ఆదర్శమన్నారు.

సర్వేంద్రియానం నయనం ప్రధానం, ప్రజల కంటి సమస్యలు తీర్చే చక్కని మార్గం కంటి వెలుగని, అందత్వ రహిత తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్, ఎంపీపీ ఎల్లుబాయ్, జడ్పీటీసీ అనిత, డీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ జహంగీర్, రైతు బంధు మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, మండల కో అప్షన్ సభ్యులు జహీర్, సర్పంచులు, మండల పార్టీ అధ్యక్షులు సుదర్శన్, పార్టీ నాయకులు, ఆశా వర్కర్స్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement