Sunday, August 1, 2021

తాగునీటి పైపులైన్..

మేడ్చల్‌ : ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా తాగునీ టీ పైపులైన్‌ పనులను కౌన్సిలర్‌ రాజకుమారి సుధాకర్‌ ప్రారంభించారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాసరేగడి మున్సిపల్‌ పట్టణంలో 11లక్షల 60వేల రూపాయల మున్సిపల్‌ నిధులతో ఎస్సీ కాలనీలో తాగునీటి పైపులైన్‌ పనులను కౌన్సిలర్‌ లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాసరేగడి మున్సిపల్‌ పట్టణ ప్రజలకు తాగు నీటి సమస్య పరిష్కారానికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డిని, మున్సిపల్‌ కమిషనర్‌ కె. అమరేందర్‌ రెడ్డి, డిఈ చిరంజీవులను నిధులను మంజూరు చేయాలని కోరగా వెంటనే మంజూరు చేసినందకు కౌన్సిలర్‌ రాజకుమారి సుధాకర్‌ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మున్సిపల్‌ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హమీలను తూచ తప్పకుండా అమలు చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని కౌన్సిలర్‌ రాజకుమారి సుధాకర్‌ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యులు చిన్నప్పరెడ్డి, తెరాస నాయకులు సుధాకర్‌, స్థానిక ప్రజలు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News