Friday, September 27, 2024

RR: త్వరలోనే అందుబాటులోకి డబుల్ బెడ్రూంలు – కలెక్టర్ శశాంక

కొత్తూరు, సెప్టెంబర్ 18 (ప్రభ న్యూస్) : త్వరలోనే అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూంలను అందుబాటులోకి తీసుకు వస్తామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలను బుధవారం జిల్లా కలెక్టర్ శశాంక, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా చివరి దశలో ఉన్న డబుల్ బెడ్రూం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, ఎమ్మార్వో, ఇంచార్జి ఎంపీడీఓ, మున్సిపల్ కమీషనర్, మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement