Friday, March 29, 2024

రూ.కోటి 50 లక్షలతో గ్రంథాలయ సంస్థ అభివృద్ధి

వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ రూ.కోటి 50 లక్షలతో నూతన మెరుగులు దిద్దుకుంటోంది. గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు జిల్లా కేంద్ర గ్రంథాలయంగా ఉన్న వికారాబాద్ నూతన జిల్లాగా ఏర్పాటు అనంతరం వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థగా మారింది. పాత జిల్లా గ్రంథాలయ సంస్థ భవనానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి 50 లక్షలు కేటాయించి నూతన భవనాన్ని నిర్మింప చేశారు. ఈ సందర్భంగా జీ ప్లస్ త్రీ భవనాన్ని నిర్మించి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ మాట్లాడుతూ… జనవరి 26 నాటికి పూర్తి స్థాయిలో భవనాన్ని సిద్ధం చేసి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా స్థానిక ఎమ్మెల్యే ఆనంద సహకారంతో ప్రారంభించే దిశగా ఆలోచిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ భవనం అందుబాటులోకి వస్తే నూతనంగా మెడికల్ కళాశాల విద్యార్థులకు, స్థానిక గ్రంథాలయ సంస్థ పాఠకులకు ఎన్నో సౌకర్యాలు చేకూరనున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement