Saturday, April 10, 2021

సిఎం సహాయ నిధితో పేద ప్రజలకు వెలుగులు..

కేశంపేట : పేద ప్రజలకు కార్పోరేట్‌ వైద్యం అందించేందుకు సిఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని ఎంపీపీ రవీందర్‌ యాదవ్‌ అన్నారు. ఎక్లాస్‌ ఖాన్‌ పేటలో వివిధ కారణాలతో అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందిన ఇద్దరు నిరుపేద లబ్దిదారులకు సిఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను ఎంపిపి రవీందర్‌ యాదవ్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. సిఎం సహాయ నిధి పేద ప్రజలకు వెలుగులు నింపుతుందని అన్నారు. ఆపదలో సిఎం సహాయ నిధి ఆపద్భందువునిగా ఆదుకుంటుందని ఆయన తెలిపారు. మానవతా దృక్పథంతో సిఎం కేసిఆర్‌ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని అన్నారు. వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు ఈ ఫండ్‌ ఆసరాగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మురళిదర్‌రెడ్డి, కోఆప్షన్‌ సభ్యులు జమాల్‌ఖాన్‌, సర్పంచ్‌లు నవీన్‌ , శ్రీను, ఎంపిటిసి మల్లేష్‌, వేణు చారీ, జగన్‌ రెడ్డి, లక్ష్మయ్య, తదితరులు పాల్గోన్నారు

Advertisement

తాజా వార్తలు

Prabha News